Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:39 AM

తిరుమలకు నో ఎంట్రీ’ ప్రచారం అవాస్తవం – TTD స్పష్టీకరణ

25-12-2025 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టోకెన్లు లేకున్నా దర్శనం ఉంటుంది – TTD ఛైర్మన్

స్థానికం ప్రతినిధి తిరుపతి

తిరుమలకు టోకెన్లు లేని భక్తులకు ప్రవేశం లేదంటూ సాగుతున్న ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. భక్తులు తిరుమలకు రావద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు.

వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై స్పష్టత ఇచ్చిన ఆయన, తొలి మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులకే ప్రత్యేక దర్శనం కల్పిస్తామని తెలిపారు. అయితే జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేకపోయినా ప్రతి భక్తుడికి దర్శన అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

గతంలో ఎదురైన అనుభవాలు, భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా వ్యాప్తి అవుతున్న వదంతులను నమ్మవద్దని భక్తులకు TTD సూచించింది.

తిరుమలలో దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని, భక్తులు ఎలాంటి సందేహాలకు లోనవ్వాల్సిన అవసరం లేదని ఛైర్మన్ స్పష్టం చేశారు.

Sthanikam

తిరుమలకు నో ఎంట్రీ’ ప్రచారం అవాస్తవం – TTD స్పష్టీకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News