Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 05:25 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన మార్చిలో 18 రోజులు బ్యాంకులు మూత

28-02-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

న్యూఢిల్లీ : ఫిబ్రవరి నెలాఖరు సమీపిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. మార్చి 1 నుండి 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ పండుగలు, ఆదివారాలు, రెండవ మరియు నాల్గవ శనివారాల కారణంగా మొత్తం 18 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

హోలీ, గుడి పడ్వా, ఉగాది, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి వంటి పండుగల సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. అదేవిధంగా ప్రతి ఆదివారం, రెండవ మరియు నాల్గవ శనివారాలు సాధారణ సెలవులుగా కొనసాగనున్నాయి.

రాష్ట్రాల వారీగా పండుగల ఆధారంగా సెలవులు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల సంబంధిత నగరాల్లోని బ్యాంకు శాఖల పనివేళలను ముందుగానే తెలుసుకోవాలని అధికారులు సూచించారు.

సెలవుల నేపథ్యంలో అత్యవసర బ్యాంకింగ్ లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని ఆర్బీఐ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎంల సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.

Sthanikam

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన మార్చిలో 18 రోజులు బ్యాంకులు మూత

Article Image

న్యూఢిల్లీ : ఫిబ్రవరి నెలాఖరు సమీపిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. మార్చి 1 నుండి 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ పండుగలు, ఆదివారాలు, రెండవ మరియు నాల్గవ శనివారాల కారణంగా మొత్తం 18 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

హోలీ, గుడి పడ్వా, ఉగాది, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి వంటి పండుగల సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. అదేవిధంగా ప్రతి ఆదివారం, రెండవ మరియు నాల్గవ శనివారాలు సాధారణ సెలవులుగా కొనసాగనున్నాయి.

రాష్ట్రాల వారీగా పండుగల ఆధారంగా సెలవులు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల సంబంధిత నగరాల్లోని బ్యాంకు శాఖల పనివేళలను ముందుగానే తెలుసుకోవాలని అధికారులు సూచించారు.

సెలవుల నేపథ్యంలో అత్యవసర బ్యాంకింగ్ లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని ఆర్బీఐ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎంల సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News