Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:41 AM

రీఛార్జ్ ముగిసినా ఇన్‌కమింగ్ ఆపొద్దు: ఎంపీ రాఘవ్ చద్దా

11-03-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. మంత్లీ ప్లాన్ల పేరుతో టెలికాం సంస్థలు 28 రోజుల రీఛార్జ్ విధానం అమలు చేస్తూ వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నాయని ఆయన విమర్శించారు. సంవత్సరానికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తోందని పేర్కొన్నారు.

రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్‌కమింగ్ కాల్స్‌ను నిలిపివేయడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా బ్యాంక్ ఓటీపీలు, అత్యవసర కాల్స్ అందకుండా పోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రీఛార్జ్ ముగిసినా కనీసం ఒక సంవత్సరం పాటు ఇన్‌కమింగ్ కాల్స్ మరియు ఓటీపీ సేవలను కొనసాగించేలా నిబంధనలు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అలాగే వినియోగదారు నంబర్‌ను మూడు సంవత్సరాల వరకు డీయాక్టివేట్ చేయకూడదని కూడా డిమాండ్ చేశారు.

ప్రస్తుతం మొబైల్ ఫోన్ విలాస వస్తువు కాదని, సామాన్య ప్రజల రోజువారీ జీవన విధానంలో కీలక భాగమైందని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. టెలికాం సంస్థలు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సరైన విధానాలు అమలు చేయాలని ఆయన సూచించారు.

Sthanikam

రీఛార్జ్ ముగిసినా ఇన్‌కమింగ్ ఆపొద్దు: ఎంపీ రాఘవ్ చద్దా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News