Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:20 AM

పంచాయతీ కార్యదర్శి నుంచి DSP దాకా..

పంచాయతీ కార్యదర్శి నుంచి DSP దాకా..

పంచాయతీ కార్యదర్శి నుంచి DSP దాకా..
14-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

తండ్రి కలను సాకారం చేసిన మధు చరణ్!

కాకినాడ, : "సర్కారు బడిలో చదివితే ఏం సాధిస్తారు?" అని ఈసడించుకునే వారికి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామానికి చెందిన మధు చరణ్ తన విజయంతో సమాధానం చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు తండ్రి అప్పారావుకుమారుడు, గ్రూప్-1 పరీక్షలో సివిల్ DSP పోస్టుకు ఎంపికై అసాధారణ విజయంసాధించాడు. ప్రభుత్వ బడి పునాది, కష్టసహనం, తండ్రి మార్గదర్శకత్వంతో ఈ యువకుడు గ్రామీణ యువతకు స్ఫూర్తి.

ప్రభుత్వపాఠశాలల్లోనే చదువు. తండ్రి అప్పారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గౌరవంతో ఉద్యోగం చేస్తూ, ఇద్దరు కుమారులను ఐదో తరగతి వరకు గ్రామ ప్రభుత్వ బడిలో, ఆతర్వాత ఏలేశ్వరం హైస్కూల్‌లో చదివించారు. ఆ పునాది మధు చరణ్‌ను 2013లో 10వతరగతిలో మండల టాపర్‌గా నిలబెట్టింది. "ప్రభుత్వ బడులు ప్రతిభకు అడుగుజాడ" అని నిరూపించాడు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ లక్షల జీతాలు తలుపుతట్టాయి. కానీ మధు చరణ్ప్రజాసేవ వైపు మొహరు తిప్పాడు. సివిల్ సర్వెంట్ కావాలనే పట్టుదలతో ఢిల్లీ కోచింగ్ జాయిన్ అయ్యాడు. ఆర్థిక ఒత్తిళ్లు, భయాల మధ్య 2019లో సచివాలయ ఉద్యోగాల్లో గ్రేడ్-5 కార్యదర్శిగా ఎంపికై, అన్నదమ్ములిద్దరూ ఒకేసారి సత్తా చాటారు. పంచాయతీ కార్యదర్శిగా ఒడిదుడుకులు. ఇంటి పన్నుల వసూళ్లు, సర్వేలు, రాజకీయ వత్తిడి మధ్య పని. స్నేహితులు విదేశాల్లో, సాఫ్ట్‌వేర్‌లో భారీ ప్యాకేజీలు పొందగా, మధు చరణ్ ఊరి వీధుల్లో పింఛన్లు పంచుతూ తిరిగాడు. "ఇదేనా నీ చదువుకు గౌరవం?" అన్న చూపులు వచ్చినా వెనక్కాడలేదు. నిబద్ధతతో కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ సేవా పురస్కారం సాధించాడు. 2022లో కలను సాకారం చేసుకోవాలని ఉద్యోగానికి సెలవు పెట్టి హైదరాబాద్ చేరాడు. గ్రూప్-1 పరీక్షలో రాత్రింబవళ్లు పుస్తకాలతో గడిపి, లక్షలాది పోటీదారుల్లో 87 మంది సీట్లలో ఒకటి సాధించి DSPగా ఎంపికైంది. గ్రామ ప్రజలు గర్వపడుతున్నారు. "కష్టం నీదైతే విజయం నీ బానిస" అని నిరూపించాడు. నేటి యువతకు మధు చరణ్ స్ఫూర్తి. ప్రభుత్వ బడులు, ఉద్యోగాలు సాధ్యమేనని చూపించాడు. తండ్రి కలను సాకారం చేసిన కొడుకు రాబోయే రోజుల్లో పోలీస్ శాఖలోఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఆశ. గ్రామీణ యువత పట్టుదలకు ఉదాహరణ.

Sthanikam

పంచాయతీ కార్యదర్శి నుంచి DSP దాకా..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News