Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

పాన్ కార్డు నిబంధనల్లో సంచలన మార్పులు

పాన్ కార్డు నిబంధనల్లో సంచలన మార్పులు

పాన్ కార్డు నిబంధనల్లో సంచలన మార్పులు
03-03-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు

న్యూఢిల్లీ: పాన్ కార్డు వినియోగంపై కీలక మార్పులను ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం–2025 ద్వారా పన్ను విధానాన్ని మరింత సరళతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మార్పులు దేశవ్యాప్తంగా ఇండియా లో అమలులోకి రానున్నాయి.

సెక్షన్ల సంఖ్య భారీగా తగ్గింపు

పాత చట్టంలో ఉన్న విభాగాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం సెక్షన్ల సంఖ్యను 536కు కుదించారు. క్లిష్టమైన నిబంధనలను సులభంగా అర్థమయ్యేలా మార్చడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు స్పష్టత కల్పించాలనే లక్ష్యంతో ఈ సంస్కరణలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

బ్యాంకింగ్ లావాదేవీల్లో సడలింపు

ఇప్పటివరకు రోజుకు రూ.50 వేలకుపైగా నగదు లావాదేవీలకు పాన్ తప్పనిసరి కాగా, కొత్త నిబంధనల ప్రకారం వార్షికంగా రూ.10 లక్షల వరకు పరిమితి నిర్ణయించారు. దీంతో చిన్నచిన్న లావాదేవీలకు తరచుగా పాన్ చూపాల్సిన అవసరం తగ్గనుంది.

ఆస్తి కొనుగోలు, హోటల్ బిల్లులపై మార్పులు

ఆస్తి కొనుగోలులో పాన్ చూపాల్సిన కనీస పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. హోటళ్లలో ఒక్కసారిగా చెల్లించే బిల్లుల విషయంలో ఈ పరిమితిని రూ.1 లక్షగా నిర్ణయించారు.

వాహనాల కొనుగోలుకు ఊరట

రూ.5 లక్షల లోపు విలువ గల వాహనాల కొనుగోలుకు పాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. మధ్యతరగతి వర్గాలకు ఇది ఉపశమనం కలిగించనుంది.

పన్ను విధానాన్ని సరళతరం చేస్తూ సామాన్యులకు భారం తగ్గించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

పాన్ కార్డు నిబంధనల్లో సంచలన మార్పులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News