Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:27 AM

న్యాల్కల్ రోడ్డెక్కిన ఎన్సీపీ.. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తల ఆందోళన

02-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ : న్యాల్కల్ మండల కేంద్రంలో ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎన్సీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై కక్షపూరిత చర్యలకు పాల్పడటం తగదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. వెంటనే ప్రతిపక్ష నేతలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

నిరసన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై కూర్చుని నినాదాలు చేశారు. కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, న్యాల్కల్ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎంపీటీసీ తనయుడు వెంకట్ (X) పాల్గొన్నారు. అలాగే హోతి నాగిశెట్టి, బొల్లి కాశప్ప, సున్నపు సత్యనారాయణ, వెంకట్, ముజఫర్ పటేల్, ఇసాం పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాల్కల్ రోడ్డెక్కిన ఎన్సీపీ.. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తల ఆందోళన

Article Image

జహీరాబాద్ : న్యాల్కల్ మండల కేంద్రంలో ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎన్సీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై కక్షపూరిత చర్యలకు పాల్పడటం తగదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. వెంటనే ప్రతిపక్ష నేతలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

నిరసన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై కూర్చుని నినాదాలు చేశారు. కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, న్యాల్కల్ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎంపీటీసీ తనయుడు వెంకట్ (X) పాల్గొన్నారు. అలాగే హోతి నాగిశెట్టి, బొల్లి కాశప్ప, సున్నపు సత్యనారాయణ, వెంకట్, ముజఫర్ పటేల్, ఇసాం పటేల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News