Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:14 AM

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లే బంగారం ధర పెరుగుదల

23-02-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

బంగారం ధరలకు కేంద్ర బ్యాంకులే బలం: నిర్మలా సీతారమన్

గ్లోబల్ డిమాండ్ పెరుగుదలతో ఎగిసిపడుతున్న బంగారం

అమెరికా సుంకాల ప్రభావం అంచనా వేయడం తొందరపాటు

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీ స్థాయిలో బంగారం కొనుగోళ్లు చేపట్టడం వల్లే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు.

ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయని చెప్పారు. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి ధరలు ఎగసిపడుతున్నాయని వివరించారు.

దేశంలో బంగారం, వెండి దిగుమతులు ప్రస్తుతం ఆందోళనకర స్థాయిలో లేవని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని తెలిపారు. అవసరమైతే తగిన విధానపరమైన చర్యలు తీసుకునే సామర్థ్యం ఆర్‌బీఐకి ఉందన్నారు.

ఇటీవల అమెరికా సుంకాల్లో చేసిన మార్పుల ప్రభావంపై స్పందిస్తూ, వాటి ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే స్పష్టమైన అంచనాలు వెల్లడించగలమని పేర్కొన్నారు.

Sthanikam

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లే బంగారం ధర పెరుగుదల

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News