Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:47 AM

కాలినడకన ప్రపంచ యాత్ర చేస్తున్న వ్యక్తి.. 27 ఏళ్లుగా 50 వేల కిలోమీటర్లు.. తుది దశకు చేరిన ప్రయాణం

15-12-2025 561 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి

29 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి.. కాలినడకన ప్రపంచ దేశాలను చుట్టి వచ్చే అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇప్పటివరకు గత 27 ఏళ్లుగా పలు దేశాల గుండా దాదాపు 50 వేల కిలోమీటర్ల ప్రయాణం సాగించాడు. మరో 1600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. తన గమ్యస్థానం చేరుకోనున్నాడు. ఈ రెండున్నర దశాబ్దాలుగా దేశాలు, ఎడారులు, యుద్ధ భూములు, గడ్డ కట్టిన సముద్రాలను దాటేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు. ఎందుకు ఇలాంటి అసాధారణ సాహసం చేస్తున్నాడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బ్రిటిష్ మాజీ పారాట్రూపర్ అయిన కార్ల్ బుష్బీ .. ప్రపంచ దేశాలను కాలినడకన తిరుగుతున్నాడు. 1998లో తన 29వ ఏట.. ప్రపంచాన్ని మొత్తం చుట్టి వచ్చే అసాధారణమైన గోలియత్ ఎక్స్‌పెడిషన్‌ను మొదలుపెట్టాడు. గత 27 సంవత్సరాలుగా నిరంతరాయంగా నడుస్తూ.. 25 దేశాలను దాటేశాడు. ఈ కాలంలో ఇప్పటివరకు 50 వేల కిలోమీటర్లు నడిచాడు. ఎడారి ప్రాంతాలతోపాటు.. గడ్డకట్టిన సముద్రాలను దాటేసి.. ఇప్పుడు తన ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు కేవలం 16000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ ప్రయాణంలో యుద్ధాలు జరిగే దేశాల మీదుగా కూడా కార్ల్ బుష్బీ ప్రయాణం సాగించడం విశేషం.

చిలీ దేశంలో ప్రారంభమైన ఈ 50 వేల కిలోమీటర్ల నడక యాత్ర.. ఇప్పటివరకు ఏ మానవుడు చేయని సుదీర్ఘ నడక యాత్రగా నిలిచింది. 2008 ఆర్థిక సంక్షోభం, కొవిడ్-19 మహమ్మారి సహా ఎన్నో అడ్డంకులను అధిగమించిన కార్ల్ బుష్బీ.. 2026 సెప్టెంబర్ నాటికి ఇంగ్లాండ్‌లోని తన స్వస్థలం హల్‌కు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

Sthanikam

కాలినడకన ప్రపంచ యాత్ర చేస్తున్న వ్యక్తి.. 27 ఏళ్లుగా 50 వేల కిలోమీటర్లు.. తుది దశకు చేరిన ప్రయాణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News