Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

గర్భిణీలకు కేంద్రం ‘మాతృ వందన’ భరోసా – రూ.11,000 వరకు ఆర్థిక సాయం

21-02-2026 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, శిశు సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న (పీఎమ్ఎమ్ వివై) పథకం కింద అర్హులైన మహిళలకు మొత్తం రూ.11,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.

ఈ పథకం ప్రకారం మొదటి సంతానానికి రూ.5,000 మూడు విడతల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అవుతుంది. గర్భధారణ నమోదు అనంతరం రూ.1,000, గర్భధారణ ఆరు నెలలు పూర్తయ్యాక రూ.2,000, శిశువు తొలి టీకా అనంతరం రూ.2,000 చొప్పున చెల్లిస్తారు.

రెండో సంతానం (ప్రత్యేకించి బాలిక జననం) సందర్భంలో అదనంగా రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఈ విధంగా మొత్తం రూ.11,000 వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది.

దరఖాస్తు చేసుకోవాలనుకునే గర్భిణీలు తమ సమీప అంగన్‌వాడీ కేంద్రంలో ఫారం నింపి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, గర్భధారణ వైద్య నివేదిక సమర్పించాలి. అలాగే అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించారు.

గర్భిణీలకు పోషకాహారం, తల్లి-శిశు ఆరోగ్య సంరక్షణతో పాటు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

గర్భిణీలకు కేంద్రం ‘మాతృ వందన’ భరోసా – రూ.11,000 వరకు ఆర్థిక సాయం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News