Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:40 AM

ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు

ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు

ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు
10-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిలిండర్ బుకింగ్‌ల మధ్య ఉండే గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది.

ఇటీవల సిలిండర్ల కొరత వస్తుందనే భయంతో కొందరు వినియోగదారులు ముందస్తుగా బుకింగ్‌లు చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. సాధారణంగా 55 రోజులకోసారి సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులు కూడా ప్రస్తుతం 15 రోజుల్లోనే మళ్లీ బుకింగ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. దీంతో గతంలో 21 రోజుల లాక్-ఇన్ నిబంధనను అమలు చేసిన ప్రభుత్వం, తాజాగా ఆ గడువును 25 రోజులకు పెంచింది.

ఇదిలా ఉండగా, గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై ఇటీవల కేంద్రం రూ.60 ధర పెంపు చేసింది. వాణిజ్య సిలిండర్లపై రూ.114.50 వరకు ధరలు పెరిగాయి. మరోవైపు గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ వినియోగదారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

అలాగే ఎల్‌పీజీ సరఫరా కోసం అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని తెలిపాయి. దేశంలో పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ నిల్వలు ప్రస్తుతం సరిపడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News