Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 05:37 AM

అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే

30-12-2025 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ స్థానిక ప్రతినిధి

హైదరాబాద్, డిసెంబర్ 29: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ నుంచి ఎందుకు వెళ్లిపోయారో తెలీదని.. ఈ ప్రశ్న ఆయననే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులకు సీఎం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై ముఖ్యమంత్రిని జర్నలిస్టులు ప్రశ్నించారు. అలాగే ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో ఏం మాట్లాడారని వారు అడిగారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. కేసీఆర్, తాను మాట్లాడుకున్నది మీకెందుకు చెబుతామని చమత్కరిస్తూ సమాధానం ఇచ్చారు.

అంతేకాకుండా అసెంబ్లీకి వచ్చిన వెంటనే కేవలం 5 నిమిషాల్లోనే కేసీఆర్ ఎందుకు వెళ్లిపోయారో ఆయన్నే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆపై వేరే విషయాలపై మీడియాతో సీఎం మాట్లాడుతూ.. అసెంబ్లీ లాబీని పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులకు యాక్సెస్ కల్పిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యేలలకు సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల వరకు మండలిని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు..

Sthanikam

అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News