Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:35 AM

ఐటీ సోదాలు జరుగుతుండగా... తుపాకీతో కాల్చుకుని బెంగళూరు రియల్ ఎస్టేట్ టైకూన్ ఆత్మహత్య

01-02-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త సీజే రాయ్ ఆత్మహత్య

ఆదాయపన్ను శాఖ సోదాల నేపథ్యంలో కార్యాలయంలోనే ఘటన తుపాకితో తలపై కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న వైనం ఐటీ దాడుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు ప్రాథమిక సమాచారం

రియల్ ఎస్టేట్ రంగంలోనే కాక, సినీ నిర్మాతగానూ ఆయన ప్రసిద్ధి

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సీజే రాయ్ (57) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని తన కార్యాలయంలో శుక్రవారం తుపాకితో కాల్చుకుని ఆయన ప్రాణాలు విడిచారు. ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆయన సంస్థలపై సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. గత రెండు, మూడు రోజులుగా కాన్ఫిడెంట్ గ్రూప్‌కు సంబంధించిన పలు ప్రాంగణాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ వరుస దాడులతో సీజే రాయ్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం లాంగ్‌ఫోర్డ్ రోడ్‌లోని తన ఆఫీసులో తలపై తుపాకితో కాల్చుకున్నారు. సిబ్బంది వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ తనను తాను కాల్చుకున్నారు. ఆసుపత్రికి తరలించగా, మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గత 2-3 రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారు, వారికి సమాచారం అందించాం" అని తెలిపారు.

కేరళలోని కొచ్చికి చెందిన సీజే రాయ్, కాన్ఫిడెంట్ గ్రూప్‌ను స్థాపించి దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కర్ణాటక, కేరళలో అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టారు. వ్యాపారవేత్తగానే కాకుండా, ఆయన మలయాళంలో సినీ నిర్మాతగానూ సుపరిచితులు. మోహన్‌లాల్ హీరోగా నటించిన 'కాసనోవా' చిత్రాన్ని నిర్మించారు. ఆశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది

Sthanikam

ఐటీ సోదాలు జరుగుతుండగా... తుపాకీతో కాల్చుకుని బెంగళూరు రియల్ ఎస్టేట్ టైకూన్ ఆత్మహత్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News