Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:16 PM

100 పడకల ఆసుపత్రి కోసం దీక్షకు వైద్యుల మద్దతు. డాక్టర్ అశోక్

18-03-2026 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం సీపీఎం ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షకు మద్దతుగా వైద్యులు ముందుకు వస్తున్నారు.

ఈ క్రమంలో డాక్టర్ అశోక్ దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే 100 పడకల ఆసుపత్రి అత్యవసరమని ఆయన అన్నారు. అందుకోసం ప్రజలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీలకతీతంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స కూడా సరిగా అందని పరిస్థితి నెలకొనడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతతో ప్రపంచ దేశాలు వైద్య రంగంలో ముందుకు సాగుతున్నప్పటికీ, ఇక్కడ మాత్రం సరైన సదుపాయాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు.

గతంలో హామీలు ఇచ్చినా అమలు కాలేదని, రామన్నపేటపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోందని విమర్శించారు. 100 పడకల ఆసుపత్రి ఏర్పడితే నిపుణులైన వైద్యులు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చి ప్రజలకు మెరుగైన సేవలు లభిస్తాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జరుగుతున్న దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. అసెంబ్లీ సమావేశాల్లోనే ఆసుపత్రి కోసం అవసరమైన నిధులు కేటాయించాలని డాక్టర్ అశోక్ డిమాండ్ చేశారు.

Sthanikam

100 పడకల ఆసుపత్రి కోసం దీక్షకు వైద్యుల మద్దతు. డాక్టర్ అశోక్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News