Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:39 PM

త్వరలో అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు?

త్వరలో అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు?

త్వరలో అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు?
14-07-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యూఢిల్లీ: దేశంలో మహిళల వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరోసారి అడుగులు వేయనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. 2027 జనగణన అనంతరం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే (SRS), నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) నివేదికల ప్రకారం దేశంలో మహిళల సగటు వివాహ వయసు గతంలో 19.3 ఏళ్లుగా ఉండగా, ప్రస్తుతం 23.1 ఏళ్లకు పెరిగినట్లు వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 24.4 ఏళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 22.6 ఏళ్లుగా నమోదైంది.

ఈ నేపథ్యంలో మహిళలకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు, మాతా-శిశు ఆరోగ్యం మెరుగుపర్చే లక్ష్యంతో కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ ప్రతిపాదనపై 2021లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. అయితే 17వ లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లు ల్యాప్స్ అయింది. ఇప్పుడు తాజా జనాభా, ఆరోగ్య గణాంకాల ఆధారంగా 2027 జనగణన తర్వాత మరోసారి బిల్లును తీసుకురావచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి

Sthanikam

త్వరలో అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు?

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News