Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 12:10 PM

విమానాశ్రయం లేదు… కరెన్సీ లేదు… అయినా సంపన్న దేశం లిక్తెన్‌స్టెయిన్

19-02-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

యూరప్‌లోని చిన్న దేశం లిక్తెన్‌స్టెయిన్ పరిమాణంలో చిన్నదైనా విశేషాల్లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు స్విట్జర్లాండ్, మరోవైపు ఆస్ట్రియా మధ్య అప్పర్ రైన్ వ్యాలీలో ఉన్న ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

లిక్తెన్‌స్టెయిన్ రాజధాని వదుజ్కు నేరుగా విమాన ప్రయాణం సాధ్యం కాదు. ఈ దేశానికి అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోవడంతో పర్యాటకులు ముందుగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయంకు చేరుకుని అక్కడి నుంచి రైలు లేదా రహదారి మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.

ఇంత ధనిక దేశమైనప్పటికీ వీరికి సొంత కరెన్సీ లేదు. స్విట్జర్లాండ్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం స్విస్ ఫ్రాంక్నే అధికారిక కరెన్సీగా వినియోగిస్తున్నారు. దేశంలో పౌరుల కంటే రిజిస్టర్ అయిన కంపెనీలు ఎక్కువగా ఉండటం విశేషం.

ట్రాఫిక్ రద్దీ లేకుండా, నేరాల రేటు తక్కువగా, ప్రశాంత జీవనశైలితో ఈ దేశం ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 1868 నుంచే సైన్యం కూడా లేకపోవడం మరో ప్రత్యేకత. విమానాశ్రయం, సొంత కరెన్సీ, సైన్యం లాంటి వ్యవస్థలు లేకపోయినా అభివృద్ధి సాధ్యమేనని లిక్తెన్‌స్టెయిన్ నిరూపిస్తోంది.

Sthanikam

విమానాశ్రయం లేదు… కరెన్సీ లేదు… అయినా సంపన్న దేశం లిక్తెన్‌స్టెయిన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News