Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోటకొండూరులో బీఆర్‌ఎస్‌కు జోష్‌.. హరీష్‌రావుకు ఘన స్వాగతం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 05:10 AM

యూరియా పరిశ్రమలపై గ్యాస్ కొరత ప్రభావం

యూరియా పరిశ్రమలపై గ్యాస్ కొరత ప్రభావం

యూరియా పరిశ్రమలపై గ్యాస్ కొరత ప్రభావం
10-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశంలోని యూరియా పరిశ్రమలు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో గ్యాస్ సరఫరా దెబ్బతినడంతో భారతదేశంలో యూరియా ఉత్పత్తి తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

గ్యాస్ లభ్యత తగ్గిపోవడంతో దేశంలోని అనేక యూరియా తయారీ ప్లాంట్లు ప్రస్తుతం సుమారు 60 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో దేశంలో యూరియా కొరత తలెత్తే అవకాశముందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గతంలో టన్నుకు సుమారు 475 డాలర్లు ఉన్న యూరియా ధర ప్రస్తుతం 25 శాతం కంటే ఎక్కువ పెరిగి దాదాపు 600 డాలర్లకు చేరినట్లు సమాచారం. ఈ పెరుగుదల రైతులకు పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం మూతపడిన గ్యాస్ ప్లాంట్లు మళ్లీ పూర్తిస్థాయిలో ప్రారంభమైన తర్వాతే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకునే అవకాశముందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు యూరియా ఉత్పత్తి మరియు సరఫరాపై ఒత్తిడి కొనసాగవచ్చని వారు సూచిస్తున్నారు.

Sthanikam

యూరియా పరిశ్రమలపై గ్యాస్ కొరత ప్రభావం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News