Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:08 AM

ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో పని చేయాలి: మంత్రి సవితమ్మ

10-06-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

గోరంట్ల మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) అవగాహన కార్యక్రమంలో మంత్రి సవితమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుందని, క్షేత్రస్థాయిలో ప్రతి నాయకుడు, కార్యకర్త అప్రమత్తంగా ఉండి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే పరిస్థితులు, ఓటరు ధృవీకరణ విధానం, కుటుంబ లింకేజీల పరిశీలన, డ్రాఫ్ట్ ఓటరు జాబితా పరిశీలన, అభ్యంతరాల నమోదు తదితర అంశాలపై సమావేశంలో సమగ్ర అవగాహన కల్పించినట్లు తెలిపారు.ప్రతి 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం సాధారణ ప్రక్రియ అని, 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. జూలై 14వ తేదీలోపు రెండు దఫాలుగా ఓట్ల మ్యాపింగ్ జరుగుతుందని, అనంతరం జూలై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాల్సి ఉంటుందని వివరించారు.ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని పనిచేయాలని మంత్రి సవితమ్మ పిలుపునిచ్చారు.

Sthanikam

ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో పని చేయాలి: మంత్రి సవితమ్మ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News