Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:15 AM

అంగీకారంతో శారీరక బంధం.. అత్యాచారం కాదు! వివాహ హామీ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

09-06-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాలను అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకుని తర్వాత పెళ్లి చేసుకోలేదనే కారణంతో ప్రతి కేసును అత్యాచారంగా చూడలేమని పేర్కొంది.

తెలంగాణకు చెందిన ఓ జంటకు సంబంధించిన కేసును విచారించిన ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. 2014లో పరిచయమైన వీరిద్దరూ ప్రేమ సంబంధం కొనసాగించగా, పరస్పర అంగీకారంతో పలుమార్లు శారీరక సంబంధాలు ఏర్పడ్డాయి. అనంతరం వివాహం జరగకపోవడంతో మహిళ ఫిర్యాదు చేయగా అత్యాచారం కేసు నమోదైంది.

కేసు వివరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఇద్దరు పెద్దవాళ్లు తమ ఇష్టప్రకారం సంబంధం కొనసాగించినప్పుడు దానిని అత్యాచారంగా పరిగణించడం సరికాదని అభిప్రాయపడింది. కేవలం వివాహం జరగలేదనే కారణంతో నేరం జరిగినట్లు భావించరాదని స్పష్టం చేసింది.

అయితే మొదటి నుంచే మోసం చేయాలనే ఉద్దేశంతో వివాహ హామీ ఇచ్చి సంబంధం పెట్టుకున్నట్లు నిరూపితమైతే అలాంటి కేసులను భిన్నంగా పరిగణించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుడిపై నమోదైన అత్యాచార కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ తీర్పు భవిష్యత్తులో వివాహ హామీ, పరస్పర అంగీకారంతో ఏర్పడిన సంబంధాలకు సంబంధించిన కేసుల విచారణలో కీలక మార్గదర్శకంగా నిలవనుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Sthanikam

అంగీకారంతో శారీరక బంధం.. అత్యాచారం కాదు! వివాహ హామీ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News