Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:10 AM

ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ

ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ

ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ
20-02-2026 172 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సుంకాలు విధించే అధికారం లేదని అమెరికా అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు

వసూలు చేసిన అదనపు పన్నులు తిరిగి చెల్లించాలని ఆదేశం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను అమెరికా అత్యున్నత న్యాయస్థానం చట్టవిరుద్ధమని ప్రకటించింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టంచేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై విధించిన సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం తేల్చింది. జాతీయ అత్యవసర పరిస్థితుల పేరుతో అమలు చేసిన విస్తృత వాణిజ్య చర్యలను సమర్థించేందుకు అత్యవసర అధికారాలను వినియోగించడం సరికాదని పేర్కొంది. అధ్యక్షుడు తన అధికార పరిధిని అధిగమించారని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు ప్రభుత్వం వసూలు చేసిన అదనపు పన్నులను సంబంధిత దేశాలకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. జాతీయ అత్యవసర పరిస్థితుల కోసం రూపొందించిన చట్టాలను దుర్వినియోగం చేస్తూ సుంకాలు విధించారని న్యాయస్థానం స్పష్టం చేసింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు, సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి కాకుండా పార్లమెంట్‌కు చెందుతుందని తీర్పులో వెల్లడించింది. సుంకాలను ఆర్థిక, విదేశాంగ విధానాలలో కీలక సాధనంగా వినియోగించిన నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తీర్పుతో ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Sthanikam

ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News