Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోటకొండూరులో బీఆర్‌ఎస్‌కు జోష్‌.. హరీష్‌రావుకు ఘన స్వాగతం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 05:08 AM

దుబాయ్‌లో నిలిచిపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

04-03-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో నిలిచిపోయినట్లు సమాచారం. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై దాడులు జరగడంతో అక్కడి ప్రభుత్వం విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది.

కుటుంబ సభ్యుడి వైద్యం కోసం ప్రయాణం

మంత్రి ఐదు రోజుల క్రితం తన కుటుంబ సభ్యుడి అనారోగ్యం కారణంగా మెరుగైన వైద్యం కోసం దుబాయ్‌కు వెళ్లారు. వైద్యం పూర్తయిన తరువాత స్వదేశానికి రావాల్సి ఉండగా, ఈలోపే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

విమానాల రాకపోకలు నిలిపివేత

విమానాశ్రయంపై దాడులు జరగడంతో భద్రతా కారణాల దృష్ట్యా అన్ని విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతనే సేవలు పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం మంత్రి మరియు ఆయన కుటుంబ సభ్యులు దుబాయ్‌లోనే ఉన్నట్లు తెలిసింది. పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే తిరుగు ప్రయాణం చేయనున్నట్లు వర్గాలు వెల్లడించాయి.

Sthanikam

దుబాయ్‌లో నిలిచిపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News