Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

ఫీజు కట్టలేదని స్కూల్ లేదా కాలేజీ మీ సర్టిఫికెట్లు ఆపేస్తున్నారా? అది చట్టరీత్యా నేరం!

19-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాలా విద్యాసంస్థలు సర్టిఫికెట్లను ఒక 'తాకట్టు' వస్తువులా వాడుకుంటున్నాయి. కానీ, చట్టం ప్రకారం విద్యార్థి సర్టిఫికెట్లు అతని వ్యక్తిగత ఆస్తి. వాటిని ఆపే అధికారం ఏ ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థకు లేదు.

వాస్తవాలు

సుప్రీంకోర్టు తీర్పు: విద్యాసంస్థలు కేవలం విద్యను అందించే కేంద్రాలు మాత్రమే. అవి వ్యాపార సంస్థల్లా సర్టిఫికెట్లను హోల్డ్ (హొల్డ్) చేయకూడదు. ఫీజు బకాయిలు ఉంటే వారు సివిల్ కోర్టులో కేసు వేసి వసూలు చేసుకోవాలి తప్ప, విద్యార్థి కెరీర్‌ను అడ్డుకోకూడదు.

ఏఐసిటిఇ & యుజిసి రూల్స్: ఏ యూనివర్సిటీ లేదా కాలేజీ విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లను తన వద్ద ఉంచుకోకూడదు. కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే వాటిని చూడాలి.

పరిష్కారం

1. లిఖితపూర్వక అభ్యర్థన: ముందుగా స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఒక లేఖ రాయండి. "నేను ఫీజు కడతాను, కానీ ప్రస్తుతానికి నా సర్టిఫికెట్లు ఇవ్వండి" అని కోరండి. వారు నిరాకరిస్తే ఆ నిరాకరణను రాతపూర్వకంగా ఇవ్వమని అడగండి (చాలామంది ఇవ్వరు, ఎందుకంటే అది చట్టవిరుద్ధం).

2. ఉన్నతాధికారులకు ఫిర్యాదు: - స్కూల్ అయితే: జిల్లా విద్యాశాఖాధికారి (డిఈవో) కి ఫిర్యాదు చేయండి.

కాలేజీ అయితే: ఆ కాలేజీ ఏ యూనివర్సిటీకి అనుబంధంగా ఉందో ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయండి.

3. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు: మీ వ్యక్తిగత పత్రాలను అక్రమంగా నిర్బంధించినందుకు (రాంగ్ ఫుల్ రిస్ట్రెయింట్) పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.

4. హైకోర్టు (రిట్ పిటిషన్): ఇది అత్యంత వేగవంతమైన మార్గం. హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే, 24 నుండి 48 గంటల్లో సర్టిఫికెట్లు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఇస్తుంది. కోర్టు ధిక్కరణకు భయపడి ఏ స్కూల్ యాజమాన్యమైనా వెంటనే సర్టిఫికెట్లు ఇచ్చేస్తుంది.

Sthanikam

ఫీజు కట్టలేదని స్కూల్ లేదా కాలేజీ మీ సర్టిఫికెట్లు ఆపేస్తున్నారా? అది చట్టరీత్యా నేరం!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News