Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ దాడులు అరాచకం ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 04:39 PM

పేద విద్యార్థులకు ఘనంగా పీపీటీ ప్రవేశ పరీక్ష..

22-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండ టీఎస్‌యూటీఎఫ్‌ భవనంలో పరీక్ష నిర్వహణ..

నిరుపేద ప్రతిభావంతులకు ఉచిత విద్యే లక్ష్యం పెరుమాళ్ళ వెంకటేశం..

నల్గొండ : నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ (PPT) ప్రధాన ఉద్దేశమని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్‌ కార్యాలయంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మార్గదర్శకత్వంలో నడుస్తున్న ‘ప్రగతి విద్యా నికేతన్’ (హైదరాబాద్) 6, 7 తరగతుల ఉచిత ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షను నిర్వహించారు.

ఈ సందర్భంగా పరీక్షా పత్రాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1995లో హైదరాబాద్ శివారులోని ప్రగతి నగర్‌లో ప్రారంభమైన ఈ ట్రస్ట్ గత మూడు దశాబ్దాలుగా విద్య, వైద్య రంగాల్లో విశేష సేవలందిస్తోందని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి డిగ్రీ వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను వసతిని కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులను స్థిరపడే వరకు భరోసా కల్పిస్తూ.. విద్యార్థులు తమ కాళ్లపై తాము నిలబడే వరకు అవసరమైన ఆర్థిక వనరులను కూడా ట్రస్ట్ సమకూరుస్తోంది. ఇప్పటికే కొన్ని వందల మంది విద్యార్థులు ఈ సంస్థ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో స్థిరపడ్డారని వెంకటేశం గుర్తు చేశారు. పేద విద్యార్థులు ఇటువంటి సువర్ణ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, నలపరాజు వెంకన్న, కొమర్రాజు సైదులు, సి.హెచ్. రవీందర్, పరీక్షా పర్యవేక్షకులు (ఎగ్జామినర్స్) మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

పేద విద్యార్థులకు ఘనంగా పీపీటీ ప్రవేశ పరీక్ష..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News