Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:45 AM

నయా మోసం 40 నిమిషాల్లో మీ జిందగీ బద్నాం ఆదమరిస్తే అప్పుల్లో కూరుకుపోతారు

నయా మోసం 40 నిమిషాల్లో మీ జిందగీ బద్నాం ఆదమరిస్తే అప్పుల్లో కూరుకుపోతారు

నయా మోసం 40 నిమిషాల్లో మీ జిందగీ బద్నాం ఆదమరిస్తే అప్పుల్లో కూరుకుపోతారు
February 17, 2026 10:47 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఇది సాధారణ ఫోన్ స్కామ్ కాదు?

మరింత ప్రమాదకరం!

వాళ్లు మీ డబ్బు, పాస్‌వర్డ్, OTP అడగరు.

వాళ్లు కోరేది కేవలం మీ మంచితనం మాత్రమే! మొహమాటానికి పోతే ముండకి కడుపైనట్లు అదే మీ కొంప ముంచుతుంది!!

తస్మాత్ జాగ్రత్త!!!

ఇటీవల మాల్స్, మెట్రో స్టేషన్స్, మార్కెట్లు, పబ్లిక్ ప్రదేశాలలో ఒక కొత్త మోసం జరుగుతోంది. సాధారణంగా బాగా డ్రెస్ వేసుకున్న మధ్యవయసు లేదా వృద్ధులు ఇలా అంటారు:

“నా ఫోన్ ఎలా వాడాలో తెలియదు”

“పెన్షన్ చెక్ చేయాలి”

“తప్పుగా బటన్ నొక్కాను”

“ఒక్కసారి చూసి చెబుతారా”

మీరు సహాయం చేస్తారని ఆశించి ఫోన్ మీ చేతిలో ఇస్తారు. అసలు ప్రమాదం ఇక్కడ మొదలవుతుంది

ఆ ఫోన్ ఇప్పటికే: వీడియో కాల్‌లో ఉంటుంది లేదా

స్క్రీన్ రికార్డింగ్ ఆన్‌లో ఉంటుంది లేదా

ఫేస్ రికగ్నిషన్ అనుమతులు ఇచ్చి ఉంటుంది అంటే ఎవరో మీ ఐడెంటిటీ చూస్తూ ఉంటారు — మీరు మాత్రం సహాయం చేస్తున్నానని అనుకుంటారు


ఇది ఏఐ బయోమెట్రిక్ ఐడెంటిటీ స్కామ్.

వారు దొంగిలించేది:

మీరు ఫోన్ పట్టుకుంటే → ఫింగర్ ప్రింట్

మీరు మాట్లాడితే → వాయిస్

మీరు స్క్రీన్ వైపు చూస్తే → ఫేస్ డేటా

ఈ మూడు కలిస్తే —

మీ డిజిటల్ క్లోన్ తయారు చేయవచ్చు.

తరువాత ఏమవుతుంది?

మీ పేరుతో:

ఆన్‌లైన్ లోన్స్

క్రెడిట్ ఫైనాన్స్

కాష్ లోన్స్

ఫేస్ & వాయిస్ వెరిఫికేషన్ ఆటోమేటిక్‌గా పాస్ అవుతుంది.

30 నిమిషాల్లో మీ పేరుతో లక్షలు/కోట్ల అప్పు తీసుకుంటారు

మీ డబ్బు పోదు…

మీరు అప్పుల్లో మునిగిపోతారు

తప్పక గుర్తుంచుకోండి –

3 నియమాలు

పరిచయం లేని వ్యక్తి ఫోన్ ఎప్పుడూ చేతిలో తీసుకోకండి

తెలియని వీడియో కాల్స్ వెంటనే కట్ చేయండి

కెమెరా ముందు. మాట్లాడమంటే అసలు మాట్లాడకండి

చివరి హెచ్చరిక

“నేను తెలివైన వాడిని — నాకు ఏమీ జరగదు”

అనే నమ్మకాన్నే మోసగాళ్లు వాడుకుంటారు.

మీ కుటుంబ సభ్యులు, పెద్దలు, పిల్లలకు తప్పకుండా చెప్పండి.

ఒక్కరికి చెప్పడం = ఒకరిని కాపాడటం.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News