Sthanikam - Truth Matters
Logo

నకిరేకల్లో సేవా సందేశంతో సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహణ

Updated : 23 Feb 2026 17:57 IST
As Preferred Source 1 min read
నకిరేకల్లో సేవా సందేశంతో సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహణ

నకిరేకల్:

పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన, బంజారా సమాజ అభ్యున్నతికి సేవాలాల్ మహరాజ్ చేసిన కృషిని స్మరించారు. ఐక్యత, సేవాభావం, నిజాయితీ వంటి విలువలను ఆచరిస్తూ యువత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, బంజారా సంఘాల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

నకిరేకల్లో సేవా సందేశంతో సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహణ

Article Image

నకిరేకల్:

పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన, బంజారా సమాజ అభ్యున్నతికి సేవాలాల్ మహరాజ్ చేసిన కృషిని స్మరించారు. ఐక్యత, సేవాభావం, నిజాయితీ వంటి విలువలను ఆచరిస్తూ యువత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, బంజారా సంఘాల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి