Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:15 AM

గీత ఉన్న టాబ్లెట్‌నే విరగొట్టాలి.. లేదంటే ముప్పే

20-02-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తక్కువ డోస్ అవసరమైతే టాబ్లెట్లను రెండు ముక్కలుగా చేసి వాడటం చాలామంది చేస్తుంటారు. అయితే అన్ని మందులనూ ఇలా విరగొట్టడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

‘స్కోర్ లైన్’ (మధ్యలో గీత) ఉన్న టాబ్లెట్‌లను మాత్రమే అవసరమైతే విరగొట్టాలి. ఆ గీత ప్రత్యేకంగా సమాన మోతాదుగా విడగొట్టేందుకు తయారీ సమయంలోనే ఇస్తారు. గీత లేని టాబ్లెట్‌ను విరగొడితే మందు మోతాదు అసమానంగా మారి చికిత్స ప్రభావం తగ్గే అవకాశం ఉంది.

ప్రత్యేకంగా ఎంటరిక్ కోటింగ్ ఉన్న టాబ్లెట్‌లను అస్సలు విరగొట్టకూడదు. ఈ కోటింగ్ వల్ల మందు కడుపులో కరగకుండా నేరుగా పేగుల్లోకి వెళ్లి అక్కడే కరిగేలా చేస్తుంది. అలాంటి టాబ్లెట్‌ను విరగొడితే కోటింగ్ దెబ్బతిని కడుపులోనే కరిగి గ్యాస్ట్రిక్ సమస్యలు కలిగించవచ్చు.

అందుకే గీత లేని టాబ్లెట్‌లను స్వయంగా విరగొట్టకుండా, తక్కువ మోతాదు అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Sthanikam

గీత ఉన్న టాబ్లెట్‌నే విరగొట్టాలి.. లేదంటే ముప్పే

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News