Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 11:03 AM

పోలీసు నిర్లక్ష్యానికి 262 కోట్ల ధర: అమెరికా

12-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

అమెరికాలో పోలీసు నిర్లక్ష్యంతో మరణించిన కర్నూలు అమ్మాయి జాహ్నవి కందులకుటుంబానికి సియాటెల్ నగరం రూ.262 కోట్ల భారీ పరిహారం ప్రకటించింది. 2023 జనవరి 23న జరిగిన ఈ దారుణ ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్నిరేకెత్తించింది. దీర్ఘకాల కోర్టు పోరాటం తర్వాత ఈ ఒప్పందం జరిగింది.

ఘటన వివరాలు: కర్నూలు జిల్లా మూరాల మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన జాహ్నవి (23) అమెరికాలో ఉత్తర ఈస్టర్న్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మాస్టర్స్చదువుతోంది. 2023 జనవరి 23 రాత్రి సియాటెల్‌లో థామస్ స్ట్రీట్ దగ్గర రోడ్డు దాటుతుండగా పోలీసు అధికారి కెవిన్ డవే పెట్రోలింగ్ కారుతో 119 కి.మీ.వేగంతో ఢీకొట్టాడు. స్పీడ్ లిమిట్ 40 కి.మీ. మాత్రమే ఉన్న రోడ్డులోజాహ్నవి 100 అడుగుల దూరం ఎగిరిపడి మరణించింది. డవే అప్రమత్తంగా లేకపోవడమేకారణమని పరిశోధనలో తేలింది.

పోలీసు దారుణ వ్యాఖ్యలు: ప్రమాదం తర్వాత మరో పోలీసు అధికారి డేనియల్ అడరర్ బాడీ కెమెరా ఫుటేజ్‌లో "ఆమె చనిపోయింది, చాలా మామూలు మనిషి, 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది హహహ" అంటూహేళనగా నవ్వాడు. ఈ వీడియో 2024లో వైరల్ అవుతూ భారత్‌తోపాటుప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. డవేను విధుల నుంచి తొలగించారుకానీ నేర చార్జీలు మోపలేదు.

పరిహారం వివరాలు: సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన ప్రకారం $29 మిలియన్ డాలర్లు (రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. దీనిలో $20 మిలియన్ బీమా నుంచి వసూలు చేస్తారు. ఇది సియాటెల్ చరిత్రలో పోలీస్ నిర్లక్ష్య కేసులో అతిపెద్ద పరిహారం. కోర్టు ఆమోదం తర్వాత మొత్తం విడుదల అవుతుంది.

కుటుంబ పోరాటం: జాహ్నవి తల్లి మల్లెపల్లి సుభశిని, తండ్రి కె.వి రాఘవేంద్ర 2024లో $110 మిలియన్ డిమాండ్‌తో వ్రాంగ్‌ఫుల్ డెత్ లాసూట్ ఫైల్ చేశారు. మూడేళ్ల పోరాటం తర్వాత ఈసెటిల్మెంట్ జరిగింది. కుటుంబం ఇంకా అధికారిక స్పందన ఇవ్వలేదు. ఈ పరిహారంజాహ్నవి జీవిత విలువను ప్రదర్శిస్తూ పోలీసు వ్యవస్థలో మార్పుకుమార్గదర్శకంగా నిలుస్తుంది. అమెరికా పోలీసు వ్యవస్థలో భారతీయ కుటుంబాల పోరాటం ఈ కేసుతో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

Sthanikam

పోలీసు నిర్లక్ష్యానికి 262 కోట్ల ధర: అమెరికా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News