Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:08 PM

పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మృతి

29-12-2025 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nagole
Chanikya Madhu

రాంనగర్‌కు చెందిన ప్రణవ్ రాయ్ మృతిపై విద్యార్థి సంఘాల ఆగ్రహం..

కాలేజీ యాజమాన్యం తీరే కారణమని ఆరోపణ.

స్థానికం హైదరాబాద్ : నగరంలోని బాగ్ అంబర్‌పేటలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలో పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు

హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన శ్రీనివాస్ – స్వాతి దంపతుల కుమారుడు కేవీఎస్ ప్రణవ్ రాయ్ సాయి (17), బాగ్ అంబర్‌పేటలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం కాలేజీలో స్లిప్ టెస్ట్ ఉండటంతో, తండ్రి శ్రీనివాస్ ఉదయం 8:30 గంటల సమయంలో కుమారుడిని కాలేజీ వద్ద వదిలి వెళ్లారు. పరీక్ష రాస్తున్న సమయంలో ప్రణవ్ ఒక్కసారిగా తీవ్ర గుండెపోటుకు గురై బెంచీపైనే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రణవ్ మరణించాడని వైద్యులు ధృవీకరించారు.

యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆరోపణలు

మృతుడు ప్రణవ్ రాయ్‌కు చిన్నప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కళాశాల యాజమాన్యం వ్యవహరించిన తీరే విద్యార్థి మరణానికి దారితీసిందని తోటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

• సెలవు రోజున పరీక్ష: క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, సదరు కళాశాల నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వహించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

• మెట్లపై తిప్పడంతో పెరిగిన ఒత్తిడి: ప్రణవ్ పరీక్ష రాయాల్సిన హాల్ కింద అంతస్తులో ఉన్నప్పటికీ, సిబ్బంది పొరపాటున పై అంతస్తుకు పంపారు. తిరిగి పైనుంచి కిందకు మెట్లపై పదేపదే తిరగడం వల్ల శారీరక శ్రమ పెరిగి, గుండెపై ఒత్తిడి పడిందని తోటి విద్యార్థులు వాపోతున్నారు.

విద్యార్థి సంఘాల డిమాండ్

ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సెలవు రోజుల్లో కూడా ఒత్తిడికి గురిచేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన చేపట్టారు

Sthanikam

పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News