Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:48 PM

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజిని, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలి: తిలక్

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజిని, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలి: తిలక్

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజిని, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలి: తిలక్
February 03, 2026 08:51 PM 329 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

టెక్కలిలో భారీ బైక్ ర్యాలీ

రెడ్ బుక్కు రాజ్యాంగం వద్దు అంబేద్కర్ రాజ్యాంగం ముద్దు అంటూ నినాదాలు

టెక్కలి పోలీస్ స్టేషన్ ఎదుట తిలక్ వైసీపీ నేతల బయటయింపు

వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజిని, జోగి రమేష్ ల ఇళ్లపై దాడులకు పాల్పడిన తెలుగుదేశం, కూటమి నాయకుల పై చర్యలు తీసుకొని శిక్షించాలని వైఎస్ఆర్సిపి టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని తప్పుడు ప్రసారాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూటమి నేతలు చేస్తున్న నీచమైన విషప్రచారంపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులకు పాల్పడడం హేయమైన చర్యని వీరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డుపై తప్పుడు ప్రచారాలకు ప్రోత్సహిస్తూ, పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టెక్కలి అంబేద్కర్ జంక్షన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు అంబేద్కర్ రాజ్యాంగం ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అంబేద్కర్ గారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం అంబేద్కర్ జంక్షన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టి టెక్కలి పోలీస్ స్టేషన్ వద్ద బైటాయించి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పైన.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైన ..తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఇన్చార్జి *తిలక్* గారితో పాటు జడ్పిటిసి సభ్యులు దువ్వాడ వాణి, దుబ్బ వెంకటరావు, పాలవసంత్ రెడ్డి, ఎంపీపీలు అట్ల సరోజినమ్మ, నడుపూరు శ్రీరామమూర్తి, రోనంకి ఉమా మల్లయ్య, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు ఎర్ర చక్రవర్తి, గురునాథ్ యాదవ్, కోత సతీష్, నూక సత్యరాజ్, స్థానిక నేతలు తమన్న గారి కిరణ్, సత్తారు సత్యం, మండల పార్టీ అధ్యక్షులు హనుమంతు వెంకటేశ్వరరావు, సంపతరావు హేమసుందర్ రాజు, తమిరి ఫల్గుణరావు, బుడ్డ మోహన్ రెడ్డి, జిల్లా, నియోజకవర్గ, మండల అనుబంధ విభాగాల నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News