Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 11:06 AM

చైనా: ఒక్క వేలు, ఒక్క పాదవేలుతో స్మార్ట్ ఫామ్ నిర్మించిన యువకుడు

02-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Siddipet
Deshamkosam

ఏరియా: చైనా

స్థానికం ప్రతినిధి – దేశం కోసం

చోంగ్‌క్వింగ్‌కు చెందిన లీ షియాకు చిన్ననాడే మస్క్యులర్ డిస్ట్రోఫీ వచ్చి, 36 ఏళ్లకే కేవలం ఒక వేలు, ఒక పాదవేలుతో మాత్రమే కదలగలిగే స్థితి. వెంటిలేటర్‌పై ఆధారపడి ఉన్నా, ఆసుపత్రి బెడ్‌పైనుంచే పూర్తిగా ఆటోమేటెడ్ స్మార్ట్ వ్యవసాయ సిస్టమ్ రూపొందించాడు.

చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి పెంచుకున్న లీ, ఆన్‌లైన్‌లొ స్వయంగా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. 2021లో శరీరం పనిచేయని స్థితిలో ఉన్నప్పటికీ, వర్చువల్ కీబోర్డ్‌తో కోడ్ రాస్తూ స్మార్ట్ వ్యవసాయ వ్యవస్థను డిజైన్ చేశాడు.

ఈ సిస్టమ్‌తో ఉష్ణోగ్రత, తేమ, నీరుపోసే విధానం, సెన్సర్లు, పరికరాలు అన్నీ ఆటోమేటిక్‌గా నియంత్రించవచ్చు.

ఈ ప్రయాణంలో లీ తల్లి వు డిమే ప్రధాన బలం. ఎలక్ట్రానిక్స్ తెలియకపోయినా, లీ సూచనలతో సర్క్యూట్ బోర్డులు కలపడం, పరికరాలు సరి చేయడం, డ్రైవర్‌లెస్ వాహనం తయారు చేయడం వరకు నేర్చుకుంది.

ప్రస్తుతం లీ రూపొందించిన స్మార్ట్ ఫామ్ విజయవంతంగా నడుస్తోంది. ఉత్పత్తి పెంచడం, కొత్త పంటలు ప్రయత్నించడం, మరింత ఆటోమేషన్ చేయడం అతని తదుపరి లక్ష్యాలు.

Sthanikam

చైనా: ఒక్క వేలు, ఒక్క పాదవేలుతో స్మార్ట్ ఫామ్ నిర్మించిన యువకుడు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News