Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:41 AM

భానుడి భగభగలకు బ్రేక్ తెలంగాణలో ఆరు రోజుల పాటు వర్షాలు – వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక

16-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హైదరాబాద్: మండుతున్న ఎండల మధ్య తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో వచ్చే ఆరు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈనెల 21 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.

మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. మంగళవారం, బుధవారం నాటికి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతుండటమే ఈ వర్షాలకు కారణమని వాతావరణశాఖ అధికారులు వివరించారు. ఈ ప్రభావంతో ఈనెల 21 వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఆదివారం ఉదయం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి.

ఎండల తీవ్రతకు బ్రేక్

ఈ ఏడాది తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతుంటుంది. అయితే ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండలు తీవ్రంగా మండడం ప్రారంభమైంది. మార్చి ప్రారంభానికి చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి.

ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు మండిపోతుండగా మధ్యాహ్నం సమయాల్లో నగరాలు, పట్టణాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పగటిపూట ఎండలు ఎక్కువగా ఉండగా రాత్రిపూట కూడా ఉక్కపోత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. దీంతో ప్రజలు ఏసీలు, కూలర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించడంతో ప్రజలకు కొంత ఊరట లభించినట్లు అయ్యింది.

Sthanikam

భానుడి భగభగలకు బ్రేక్ తెలంగాణలో ఆరు రోజుల పాటు వర్షాలు – వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News