PRINT TIME: June 10, 2026 01:05 PM
సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ
సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ
June 10, 2026 04:38 AM
3 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
నల్లమడ మండలం దొన్నికోట గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని, రీ-సర్వే పనులను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జేసీ సచివాలయంలోని రికార్డులను పరిశీలించి, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలు ప్రజలకు సకాలంలో అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సర్వే పనులను ఎలాంటి తప్పులు లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ తనిఖీలో AD సర్వే, IOS, DIOS, MS,తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి