గోపవరంలో రూ.47 లక్షల సీసీ రోడ్ల పనుల ప్రారంభం
గోపవరంలో రూ.47 లక్షల సీసీ రోడ్ల పనుల ప్రారంభం
GADDAM JAGANMOHAN REDDY
ముసునూరు : మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు ముసునూరు మండలం గోపవరం గ్రామంలో రూ.47 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముసునూరు మండల పార్టీ అధ్యక్షులు గద్దె రఘుబాబు, గోపవరం గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పలపాటి గణేష్‌లు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడిన గద్దె రఘుబాబు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత లో గ్రామాలు మంత్రి పార్థసారథి సారథ్యంలో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో వేగంగా ముందుకు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. గోపవరం గ్రామానికి ఇప్పటివరకు సీసీ రోడ్లు, కమిటీ హాల్స్ నిర్మాణం కోసం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత మంత్రి కొలుసు పార్థసారథిదేనని తెలిపారు.
గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల దిశగా చర్యలు కొనసాగుతున్నాయని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి