నార్కట్‌పల్లి పివిఆర్ చేతన పాఠశాలలో తైక్వాండో బెల్టుల ప్రదానోత్సవం
నార్కట్‌పల్లి పివిఆర్ చేతన పాఠశాలలో తైక్వాండో బెల్టుల ప్రదానోత్సవం
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని పివిఆర్ చేతన ఉన్నత పాఠశాలలో నల్గొండ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆదివారం బెల్టుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల హాజరయ్యారు. తైక్వాండో పరీక్షలకు ఎగ్జామినర్‌గా పట్టేడి సుధాకర్ వ్యవహరించి విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. ప్రతిభ ఆధారంగా మొత్తం 65 మంది విద్యార్థులకు వివిధ స్థాయిల బెల్టులు అందజేశారు.
బెల్టుల వివరాలు ఇలా ఉన్నాయి: రెడ్ వన్ – 2, రెడ్ – 2, బ్లూ వన్ – 4, బ్లూ – 5, గ్రీన్ వన్ – 8, గ్రీన్ – 5, ఎల్లో వన్ – 11, ఎల్లో – 28.
ఈ బెల్టులు సాధించిన విద్యార్థుల్లో నార్కట్‌పల్లి మండలానికి చెందిన 28 మంది, చిట్యాల మండలానికి చెందిన 28 మంది, రామన్నపేట మండలానికి చెందిన 9 మంది ఉన్నారు.ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ తైక్వాండో క్రీడ ప్రభుత్వ ఉద్యోగాల సాధనలోఎంతోఉపయోగపడుతుందని, ప్రభుత్వ కోటాలో రెండు శాతం ఉద్యోగాల్లో ఈ క్రీడాకారులకు అవకాశం ఉంటుందని తెలిపారు. అదనంగా ఈ క్రీడ ద్వారా విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పుచ్చకాయల వెంకట్ రెడ్డి, జవహర్ లాల్, తైక్వాండో శిక్షకులు గోలి రమేష్, పంతంగి శ్రీకాంత్, పట్టేడ ఫణీంద్ర కుమార్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి