50 ఏళ్ల తర్వాత కలిసిన 1975-76 పదో తరగతి పూర్వ విద్యార్థులు
50 ఏళ్ల తర్వాత కలిసిన 1975-76 పదో తరగతి పూర్వ విద్యార్థులు
Alpha Raw
ఆర్మూర్లో జ్ఞాపకాల హారంతో గోల్డెన్ జూబ్లీ
ఆర్మూర్ పట్టణంలో అరుదైన ఆత్మీయ క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. జిల్లా పరిషత్ హైయర్ సెకండరీ స్కూల్ (బాలుర)లో 1975-76 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఐదు దశాబ్దాల అనంతరం ఒకే వేదికపై కలుసుకుని జ్ఞాపకాల హారాన్ని అలంకరించుకున్నారు.
పట్టణంలోని క్షత్రియ మినీ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరితంగా సాగింది. అరవై దశాబ్దాల క్రితం తరగతి గదుల్లో పంచుకున్న మధుర స్మృతులు మరోసారి సజీవమయ్యాయి. ఆ రోజుల్లోని క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవభావం, హైయర్ సెకండరీ విద్యకు ఉన్న విలువ వంటి అంశాలు చర్చల్లో ప్రధానంగా నిలిచాయి.
తమ తమ కుటుంబాల వివరాలు, ఉద్యోగ జీవితం, పదవీ విరమణ అనంతర కార్యకలాపాలను పరస్పరం పంచుకుంటూ స్నేహబంధాన్ని మరింత బలపరిచారు. కష్టసుఖాలను గుర్తుచేసుకుంటూ సహపంక్తి భోజనం చేసి ఆనందంగా గడిపారు.
ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు శంకరయ్య, సుధాకర్, మార్కండేయ, రవీంద్ర మోహన్‌లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. “శేషజీవితాన్ని సమాజ సేవకు అంకితం చేస్తాం” అంటూ పూర్వ విద్యార్థులు సంకల్పం వ్యక్తం చేశారు.
ఈ సమ్మేళనంలో సుదర్శన్, రమేష్ బదామి, కర్తన్ కిషన్, మధుసూదన్, జి. మోహన్, ఆనంద్ కుమార్ గుప్తా, జెస్సు వినయ్, ఎం. రాజేశ్వర్, లక్ష్మణ్, ఎస్. మోహన్, డి. గంగాధర్, కే. సూర్యప్రకాశ్, పి. జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి