భువనగిరి: విద్యార్థులు చదువుతోపాటు ఆత్మరక్షణ విద్యల్లోనూ నైపుణ్యం సాధించాలని భువనగిరి సబ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీ నరసయ్య సూచించారు. భువనగిరి పట్టణంలోని 33వ వార్డు పరిధిలో గల శ్రీవాణి విద్యాలయంలో టైగర్ కుంఫు కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్టులు, ప్రశంసాపత్రాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో కరాటే కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఆత్మరక్షణ విద్యపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో 33వ వార్డు కౌన్సిలర్ నాకోటి నగేష్, టైగర్ కుంఫు మాస్టర్ శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి