Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 10:08 AM

అమ్మవారికి బంగారు ముక్కుపుడక సమర్పించిన సర్పంచ్ దంపతులు.

12-10-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చండీయాగంతో గ్రామానికి శుభం కలగాలని సంకల్పం.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, పద్మ దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి బంగారు ముక్కుపుడకను కానుకగా సమర్పించారు.

ఈ నెల 18న ఆలయంలో చండీయాగం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు తెలిపారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపాకటాక్షాలు గ్రామంపై ఉండాలనే సంకల్పంతో యాగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ చండీయాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏదుల ప్రభాకర్‌రెడ్డి దంపతులు, మా రెడ్డి తిరుమలరెడ్డి దంపతులు, పొట్లపల్లి సుభాష్ దంపతులతో పాటు నారాయణ రమేష్, తాటి చంద్రమౌళి, ఏర్పుల నరసింహ, మర్రి హరీష్‌రెడ్డి, కురు యాదయ్య, ఆనగంటి లింగస్వామి, ఏర్పుల వెంకన్న, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

అమ్మవారికి బంగారు ముక్కుపుడక సమర్పించిన సర్పంచ్ దంపతులు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News