Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 10:03 AM

ప్రతి ఇంటికీ యోగా.. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం!

12-10-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిన్నకాపర్తిలో యోగా, ధ్యానంపై అవగాహన.

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని అధిగమించి, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా, ధ్యానం దోహదపడతాయని పలువురు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఆదివారం రైతు వేదిక వద్ద యోగా, ధ్యాన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, మండల అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ.. ‘ప్రతి ఇంటికీ యోగా.. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం’ అనే లక్ష్యంతో గ్రామ ప్రజలు, యువకులు, విద్యార్థులకు యోగా ఆసనాలు, ధ్యానంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ‘హర్ ఘర్ ధ్యాన్’, ‘జీవించడం ఒక కళ’ కార్యక్రమాల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు జీవనశైలిలో సానుకూల మార్పులు తీసుకురావచ్చన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులో భాగంగా శ్వాస ప్రక్రియలు, ధ్యానం, సుదర్శన క్రియ సాధనతో మానసిక ప్రశాంతత, శారీరక ఉల్లాసం పెంపొందించుకోవచ్చని వివరించారు. యోగా, ధ్యానాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, అద్దెల లింగారెడ్డి, బెల్లంకొండ రఘు, ఆవుల రమేష్, మెట్టు నాగశంకర్, వలిగొండ సత్యనారాయణ, నరసింహ, ప్రశాంత్, అశోక్, వెంకన్న, దివాకర్, లింగయ్య, శంకరయ్య, రమేష్, వెంకటేష్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి ఇంటికీ యోగా.. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News