సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలం సిరూర్ గ్రామంలోని ఉరడమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆదివారం నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా ఉరడమ్మ అమ్మవారు శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి హారతి సమర్పించారు. గ్రామ సర్పంచ్ నల్లవల్లి మారుతి (విగ్రహ దాత), గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువతీ యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామ ప్రజల సహకారంతో నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి.
PRINT TIME: October 12, 2026 10:04 AM
సిరూర్ ఉరడమ్మ ఆలయంలో వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

12-10-2026
55 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలం సిరూర్ గ్రామంలోని ఉరడమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆదివారం నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా ఉరడమ్మ అమ్మవారు శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి హారతి సమర్పించారు. గ్రామ సర్పంచ్ నల్లవల్లి మారుతి (విగ్రహ దాత), గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువతీ యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామ ప్రజల సహకారంతో నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి