Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:44 AM

కొండమీద.. కోడి.. రోజు రోజుకు పెరుగుతున్న చికెన్ మాంసం..గుడ్ల ధరలు

29-12-2025 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కొండమీద.. కోడి..

రోజు రోజుకు పెరుగుతున్న చికెన్ మాంసం..గుడ్ల ధరలు

స్థానిక ప్రతినిధి

తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. వంటింట్లో కుపంటి పెట్టాలంటేనే దడుసుకునే పరిస్థితి నెలకొంది. ఉప్పు, పప్పులతోపాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక ఇదే బాటలో చికెన్‌, గుడ్ల ధరలు కూడా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్‌ 280 నుంచి రూ.300 వరకు పలుకుతుంది. ఇక గుడ్డు ధర ఏకంగా రూ.8..8:30 చేరింది. కేవలం వారములోనే కిలో చికెన్ పై 50 రూపాయలు పెరిగింది. కార్తీకమాసం ముగిసినప్పటి నుండి చికెన్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఇలా క్రమంగా వారం వారం కిలో చికెన్ పై 10 నుంచి 20 రూపాయల వరకు పెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతం కేజీ స్కిన్ చికెన్ 260 కాగా.. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280 నుండి 300 పలుకుతుంది.

ఈ రోజు ఆదివారం కావడంతో మాంసం ప్రియులు అధిక ధరలు చెల్లించి చికెన్‌ ముక్క కొనలేక గుటకలు వేస్తున్నారు. వచ్చే నెలలో సంక్రాంతి ఉండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు గుడ్ల ధరలు కూడా పెరగడంతో మధ్యాహ్న భోజనంలో విద్యార్ధులకు సైతం అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు కేవలం రూ. 6 మాత్రమే చెల్లిస్తోంది. కానీ మార్కెట్‌లో హోల్‌సేల్ ధర రూ. 7.50 ఉంది. రిటైల్ ధర రూ. 10 పలుకుతోంది. ఈ క్రమంలో విద్యార్దులకు వారానికి మూడు సార్లు అందించవల్సిన గుడ్లను రెండు సార్లు మాత్రమే అందిస్తున్నారు.

ప్రధానంగా రెండు కారణాలు..

కాగా గత కొద్దిరోజులుగా కోడిగుడ్లు, చికెన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కార్తీక మాసం ముగియడం, వరుస పండుగలు రావడంతో చికెన్‌కి ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్లుగా పౌల్ట్రీ ఉత్పత్తి లేకపోవడంతో సరఫరా దెబ్బతిని ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. మొత్తం వచ్చే పండగ నెలలోనూ చికెన్‌ రేట్లు కిలో రూ.350 నుంచి రూ.400 వరకు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Sthanikam

కొండమీద.. కోడి.. రోజు రోజుకు పెరుగుతున్న చికెన్ మాంసం..గుడ్ల ధరలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News