Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పా బీజేవైఎం చిట్యాల టౌన్ అధ్యక్షుడు యైరాల రాహుల్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 04:30 PM

న్యాల్కల్‌లో నెం.5ఎ సీఎం కప్ క్రీడాపోటీల ప్రారంభం

01-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా | న్యాల్కల్ మండలం

మండల కేంద్రమైన న్యాల్కల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నెం.5ఎ సీఎం కప్ క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ క్రీడాపోటీలను అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ, క్రీడలు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. యువత క్రీడల వైపు ఆసక్తి చూపాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ షాగుప్తా ఇఫ్తాఖ్, మండల విద్యాధికారి మారుతి రాథోడ్, ఎస్‌ఐ దోమ సుజిత్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిరేదార్ శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండంగారి తిరుపతిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ సిద్ధలింగయ్య స్వామి, డీసీసీ ఉపాధ్యక్షులు కొత్తపల్లి భాస్కర్‌రెడ్డి, నాయకులు గార్లపల్లి శివరాజ్, ప్రవీణ్ కుమార్, కాశప్ప, ఇసాం పటేల్‌తో పాటు ఉపాధ్యాయులు, క్రీడాకారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

న్యాల్కల్‌లో నెం.5ఎ సీఎం కప్ క్రీడాపోటీల ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News