Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:26 AM

న్యాల్కల్ ఉర్సే షరీఫ్ జాతరలో నేడు అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

03-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రం న్యాల్కల్ గ్రామ శివారులోని ఉర్సే షరీఫ్ పీరైబ్ సాహెబ్ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న ఉర్సే షరీఫ్ జాతర ఉత్సవాల్లో భాగంగా నేడు అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు.

జాతర ఆవరణలో ఏర్పాటు చేసిన మట్టి అఖాడాలో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన మల్లయోధులు బరిలోకి దిగనుండటంతో జాతర ప్రాంగణం కేరింతలు, ఈలలతో మారుమోగనుందని నిర్వాహకులు తెలిపారు. మల్లయోధుల మధ్య ‘నువ్వా నేనా’ అన్నట్టుగా ఉత్కంఠభరిత పోటీలు సాగనున్నాయని పేర్కొన్నారు.ఈ కుస్తీ పోటీలను తిలకించడంతో పాటు దర్గా దర్శనానికి జహీరాబాద్ ఎంపీ సురేష్‌కుమార్ శెట్కార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి హాజరవుతారని న్యాల్కల్ సొసైటీ మాజీ చైర్మన్ సిద్ధలింగయ్యస్వామి తెలిపారు.కుస్తీ పోటీల సందర్భంగా గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

కుస్తీ పోటీలతో పాటు జాతర సందర్భంగా భక్తుల సందడి, వ్యాపారుల కోలాహలం, సంప్రదాయ వైభవం కలిసి న్యాల్కల్ జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందన్నారు.జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలిపారు.

Sthanikam

న్యాల్కల్ ఉర్సే షరీఫ్ జాతరలో నేడు అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News