Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:17 AM

బాలానగర్ విమల్‌లో పేపర్ల వర్షం.. రామ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ పడిగాపులు.. థియేటర్ దద్దరిల్లింది!

బాలానగర్ విమల్‌లో పేపర్ల వర్షం.. రామ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ పడిగాపులు.. థియేటర్ దద్దరిల్లింది!

బాలానగర్ విమల్‌లో పేపర్ల వర్షం.. రామ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ పడిగాపులు.. థియేటర్ దద్దరిల్లింది!
December 06, 2025 07:37 PM 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌లోని బాలానగర్ విమల్ 70MM (మైత్రి మూవీస్) థియేటర్ ఇయ్యాల ఒక స్టేడియం లెక్క మారింది. మన ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ (Ram Pothineni) వస్తున్నడని తెలిసి, ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అసలు సినిమా మొదలైన కాడ్నుంచి థియేటర్లో ఒక్కటే జోష్.. ఒక్కటే గోల!


పేపర్ల వర్షం.. స్క్రీన్ కనిపిస్తలే! సినిమా నడుస్తున్నంత సేపు థియేటర్ నిండా పేపర్లే ఎగిరినయ్. చిన్న సీన్ వచ్చినా, మాస్ డైలాగ్ పేలినా, పాట వచ్చినా సరే.. ఫ్యాన్స్ సీట్లలో కూసోలే. పేపర్లు గాల్లోకి లేపుతూ, ఈలలు వేస్తూ థియేటర్‌ని దడదడలాడించారు. సినిమా మొత్తం ఫుల్ జోష్ మీద నడిచింది.

రామ్ అన్న ఎప్పుడొస్తాడని.. సినిమా చూస్తున్నంత సేపు అందరి కళ్లు గుమ్మం వైపే.. "రామ్ అన్న ఎప్పుడొస్తడు.. ఎప్పుడు చూద్దాం" అని థియేటర్ మొత్తం ఆత్రుతగా వెయిట్ చేసింది. ఎట్టకేలకు రామ్ రాగానే ఆ ఎక్సైట్‌మెంట్ పీక్స్‌కి వెళ్లిపోయింది. కారు దిగంగానే జనం ఎగబడ్డరు.. ప్రేమతో లాగేశిన్రు, తోసేశిన్రు.. అయినా రామ్ నవ్వుతూనే లోపలికి వచ్చిండు.


"నాలుగు సార్లు చూశినం.. చిన్ని గుండెలో సాంగ్ మా ప్రాణం" మైక్ పట్టుకున్న రామ్.. "సినిమా ఎన్ని సార్లు చూశిన్రు?" అని అడగగానే.. "నాలుగు సార్లు.. ఐదు సార్లు" అని ఆన్సర్ ఇచ్చి, తమ అభిమానాన్ని చాటుకున్నరు. ఇక "చిన్ని గుండెలో" (Chinni Gundelo) పాట అంటే తమకు ఎంత ఇష్టమో చెప్తూ అరుస్తుంటే థియేటర్ షేక్ అయ్యింది.


మొత్తానికి విమల్ థియేటర్లో ఇయ్యాల పండగ వాతావరణం కనిపించింది. రామ్ రాకతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యింది!

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News