Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 03:24 PM

మీసం తిప్పిన తెలుగోడు.. బిగ్ బాస్ 9 విన్నర్ మనోడే! కళ్యాణ్ పడాలకి పట్టాభిషేకం.. సూట్‌కేసుతో చెక్కేసిన పవన్!

21-12-2025 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 తీర్పు రానే వచ్చింది. సుమారు 105 రోజులు, రకరకాల గొడవలు, గమ్మత్తు టాస్కుల తర్వాత.. మొత్తానికి టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోయింది. మన సామాన్యుడు, ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కళ్యాణ్ పడాల (Kalyan Padala) బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించాడు.

సామాన్యుడిదే సింహాసనం: సీజన్ మొదలైనప్పుడు "ఎవరు బాబూ ఈ పోరడు?" అని అందరూ అనుకున్నారు. కానీ తన ఆటతో, మాటతో జనాల మనసు గెలుచుకున్నాడు.

ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ తర్వాత కళ్యాణ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఒక కామనర్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టి.. ఏకంగా సెలబ్రిటీలనే వెనక్కి నెట్టి టైటిల్ కొట్టడం అంటే మామూలు ముచ్చట కాదు. "జై జవాన్" అంటూ ఆడియన్స్ ఓట్లతో కళ్యాణ్ గద్దె ఎక్కాడు.

ప్రైజ్ మనీ.. కారు.. బంపర్ ఆఫర్: విన్నర్ కళ్యాణ్‌కు ట్రోఫీతో పాటు దాదాపు రూ. 35 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. అంతే కాదు, ఒక కొత్త మారుతి సుజుకి విక్టోరియస్ (Maruti Suzuki Victorious) కారు కూడా గిఫ్ట్‌గా వచ్చింది. స్పాన్సర్ల నుంచి మరో 5 లక్షలు అదనంగా దక్కడంతో మొత్తంగా కళ్యాణ్ పంట పండిందనే చెప్పాలి.

సూట్‌కేసుతో 'డీమన్' పవన్ జంప్: ఇక ఫినాలేలో అసలైన ట్విస్ట్ ఇచ్చింది మాత్రం మన 'డీమన్' పవన్ (Demon Pavan). టాప్-3లో ఉన్నప్పుడు నాగార్జున గారు ఇచ్చిన గోల్డెన్ సూట్‌కేస్ ఆఫర్‌కి పవన్ టెంప్ట్ అయ్యాడు. గెలుస్తాడో లేదో అనే డౌట్ ఎందుకని, చేతికి వచ్చిన రూ. 15 లక్షల సూట్‌కేస్ తీసుకొని హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. తెలివైన పనే చేసిండని బయట టాక్ నడుస్తోంది.

రన్నరప్‌గా తనుజా: గట్టి పోటీ ఇచ్చిన లేడీ పులి తనుజా పుట్టస్వామి (Thanuja Puttaswamy) రన్నరప్‌గా నిలిచింది. చివరి దాకా కళ్యాణ్‌కు గట్టి పోటీ ఇచ్చింది కానీ, ఓటింగ్లో కాస్త వెనకబడి ట్రోఫీని చేజార్చుకుంది. అయినా తన ఆట తీరుతో లేడీ ఫ్యాన్స్ మనసు గెలుచుకుంది.

ధూమ్ ధామ్ ఫినాలే: గ్రాండ్ ఫినాలే మామూలుగా లేదు.. రవితేజ (Ravi Teja), డింపుల్ హయతి, పాయల్ రాజ్‌పుత్ లాంటి స్టార్లతో స్టేజ్ అదిరిపోయింది. నాగార్జున గారు తనదైన స్టైల్ లో హోస్టింగ్ చేసి సీజన్ 9కి ఘనంగా వీడ్కోలు పలికారు. మొత్తానికి 105 రోజుల జాతర కళ్యాణ్ విక్టరీతో ముగిసింది.

Sthanikam

మీసం తిప్పిన తెలుగోడు.. బిగ్ బాస్ 9 విన్నర్ మనోడే! కళ్యాణ్ పడాలకి పట్టాభిషేకం.. సూట్‌కేసుతో చెక్కేసిన పవన్!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News