Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 02:09 PM

700 కిలోల 'వార్ డాగ్' బైక్ పై మనోజ్ స్వారీ.. 'డేవిడ్ రెడ్డి' టీజర్ చూశారా?

18-12-2025 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఇది బ్రిటీష్ ఇండియా కాదు.. 'డేవిడ్ రెడ్డి' ఇండియా! గూస్ బంప్స్ తెప్పిస్తున్న మంచు మనోజ్ టీజర్.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'డేవిడ్ రెడ్డి' గ్లింప్స్ నిన్న (బుధవారం) ఘనంగా విడుదలైంది.

1920ల నాటి బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
టీజర్ లో అందరి దృష్టిని ఆకర్షించింది హీరో వాడే బైక్. దీనికి 'వార్ డాగ్' అని పేరు పెట్టారు. విశేషమేమిటంటే, 'కల్కి' సినిమాలో 'బుజ్జి' కారును తయారు చేసిన టీమ్ ఈ బైక్ ను డిజైన్ చేసింది. దీని బరువు సుమారు 700 కిలోలు ఉండటం విశేషం.
మనోజ్ లుక్: పొడవాటి జుట్టు, గడ్డం, కళ్ళలో కసి.. మంచు మనోజ్ లుక్ చాలా ఇంటెన్స్ గా, మాస్ గా ఉంది. "వీడు మనోడు కాదండీ.. బ్రిటీష్ వాళ్ళకి శత్రువే, మనకీ శత్రువే" అనే డైలాగ్స్ క్యారెక్టర్ లోని వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి.
కేజీఎఫ్ (KGF) ఫేమ్ రవి బస్రూర్ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది.
రామ్ చరణ్, శింబు ఉంటారా? ఈ సినిమాలో రామ్ చరణ్, శింబు గెస్ట్ రోల్స్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై మనోజ్ స్పందిస్తూ.. "ప్రస్తుతానికి ఎవరినీ సంప్రదించలేదు, కానీ భవిష్యత్తులో ఆ ఛాన్స్ ఉంది" అని క్లారిటీ ఇచ్చారు.
వెల్వ‌ట్ సోల్ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యానర్‌పై వెంకట్ రెడ్డి, భరత్ మోత్కూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sthanikam

700 కిలోల 'వార్ డాగ్' బైక్ పై మనోజ్ స్వారీ.. 'డేవిడ్ రెడ్డి' టీజర్ చూశారా?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News