Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జడ్పీ సీఈవో శోభారాణి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 24, 2026 10:48 PM

యువ టూరిజం క్లబ్‌ పోటీల్లో హయత్‌నగర్‌కు ప్రథమ స్థానం.

24-09-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇబ్రహీంపట్నం ద్వితీయ, బడంగ్‌పేట్‌కు తృతీయ స్థానం.

హయత్‌నగర్‌: రంగారెడ్డి జిల్లా స్థాయి యువ టూరిజం క్లబ్‌ పోటీలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి. సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో అనేక నైపుణ్యాలు దాగి ఉన్నాయని, ఇలాంటి పోటీల ద్వారా తమ ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.

షార్ట్‌ఫిలిం, సోషల్‌ మీడియా, పాటలు, నృత్యం, డ్రామా, తక్కువగా ప్రాచుర్యం పొందిన చారిత్రక ప్రదేశాలు, కమ్యూనిటీ భాగస్వామ్యం, సృజనాత్మక ఆలోచన తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌ ప్రథమ స్థానం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం ద్వితీయ స్థానం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బడంగ్‌పేట్‌ తృతీయ స్థానం సాధించాయి.

విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాలను యువ టూరిజం క్లబ్‌ జిల్లా కోఆర్డినేటర్‌ షేక్‌ మహబూబ్‌ పర్యవేక్షించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ ఇందిర, ప్రొఫెసర్‌ నాగేంద్ర, డాక్టర్‌ నోముల వెంకటేశ్వర్లు, డాక్టర్‌ అపర్ణ చతుర్వేది, డి. రమాదేవి, డాక్టర్‌ బి. నరసింహ, డాక్టర్‌ వి. నాగరాజు, డాక్టర్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ వెంకటలక్ష్మి, డాక్టర్‌ శశిధర్, మల్లేశం, డాక్టర్‌ కృష్ణమోహన్, ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె. అనితతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

యువ టూరిజం క్లబ్‌ పోటీల్లో హయత్‌నగర్‌కు ప్రథమ స్థానం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News