Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

విశాలభారతిలో ఘనంగా దీపావళి సంబరాలు

Updated : 07 Nov 2026 19:26 IST
As Preferred Source 1 min read
విశాలభారతిలో ఘనంగా దీపావళి సంబరాలు

అజ్ఞానపు చీకట్లను పారద్రోలాలి: కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

పట్టణంలోని విశాల భారతి హైస్కూల్‌లో శనివారం దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని పాఠశాలలో లక్ష్మీదేవి పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు.​ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. దీపావళి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. నరకాసురుడనే రాక్షసుడిని సత్యభామ సమేతుడై శ్రీకృష్ణుడు నరక చతుర్దశి నాడు సంహరించాడని, ఆ రాక్షస సంహారంతో చీకట్లు తొలిగి వెలుగులు వికసించిన శుభ తరుణానికి సంకేతంగా దీపావళిని జరుపుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ అజ్ఞానాన్ని, చీకటిని, స్వార్థాన్ని వీడి జ్ఞాన మార్గంలో పయనించాలని, చిన్నారుల హృదయాలు సద్బుద్ధి, జ్ఞానంతో నిండాలని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

విశాలభారతిలో ఘనంగా దీపావళి సంబరాలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news