సందడిగా అమ్మవారి చీరల వేలంపాట
లక్కీ డ్రాలో పట్టు చీర, శాలువా విజేతలు
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
స్థానిక శ్రీ మార్కండేయ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి భక్తులు సమర్పించిన ఒడిబియ్యంతో శనివారం మహా అన్నదానం ఘనంగా నిర్వహించారు. పట్టణం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు పెద్ది కృష్ణ, గోశిక బలరాజు, సూరేపల్లి శివ, గోలి శ్రీను, బత్తుల యశ్వంత్ మాట్లాడుతూ.. ఒడిబియ్యంతో అన్నదానం చేపట్టడం పవిత్రమైన సేవా కార్యక్రమని, ప్రతి ఏటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని తెలిపారు. వేడుకల్లో భాగంగా అమ్మవారి చీరల వేలంపాటను ఉత్సాహంగా నిర్వహించారు. మహిళలు పోటీపడి అమ్మవారి శేషవస్త్రాలను కైవసం చేసుకున్నారు. ప్రత్యేకంగా నిర్వహించిన లక్కీ డ్రాలో చేనేత పట్టు చీరను గోశిక కరుణాకర్-సుమతి దంపతులు, పట్టు శాలువాను పోలోజు వెంకటాచారి దక్కించుకోగా,విజేతలను ఉత్సవ కమిటీ అభినందించింది.కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, ఆలయ అధ్యక్ష కార్యదర్శులు బడుగు జయప్రకాశ్, గోశిక బాలనర్సింహ పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి