మున్సిపల్ చైర్‌పర్సన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం.. పలు తీర్మానాలు.
చిట్యాల: పట్టణంలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న అకాల మరణాల నేపథ్యంలో వాటి నివారణకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిలపక్ష పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, పురోహితులు, ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ, శాక్తేయ పురోహితులు పూజ శ్రీ నాగిళ్ల లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా చిట్యాల పట్టణంలో అకాల మరణాలు ఆగిపోవాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఏకగ్రీవంగా పలు తీర్మానాలు చేశారు.
ఈ నెల 19న గురువారం దశమి సందర్భంగా పట్టణంలోని శివాలయంలో అకాల మరణ నివారణ హోమం, బొడ్రాయికి జలాభిషేకం, గ్రామ దేవతల శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే 20వ తేదీన వనవాసం వెళ్లాలని సమావేశంలో తీర్మానించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి