వాహనదారులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు విజ్ఞప్తి
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ, నిర్మాణ పనుల కారణంగా నిత్యం తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనదారులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.రహదారి పనులు జరుగుతున్న తీరును, దారి మళ్లింపులు (డైవర్షన్లు) ఉన్న ప్రాంతాలను నాయకులు పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన పోలీస్ బందోబస్తు, ముందస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మునుగోడు ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, పిఏసిఎస్ చైర్మన్ మస్తాన్ బాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, నాయకులు బొబ్బిళ్ళ రాజేందర్, బత్తుల శ్రీహరి, సీతారామచంద్ర ఆలయ చైర్మన్ బొబ్బిలి మురళి, సర్పంచ్ జ్యువి నరసింహ, బొంగు జంగయ్య గౌడ్, మున్సిపల్ కో అప్షన్ సభ్యులు బాబా షరీఫ్, పస్తం గంగారాములు, జంగయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి