దీపావళి పండుగ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు పంపించే నకిలీ లింకుల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునగాల ఎస్సై సంజీవరెడ్డి శుక్రవారం సూచించారు.పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన బహుమతులు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దని తెలిపారు.అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు వివరాలను ఎవరికీ తెలియజేయవద్దని సూచించారు. ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్సై కోరారు.
పండుగ ఆఫర్ల మాటున సైబర్ మాయాజాలం.. అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై సంజీవరెడ్డి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి